Thursday, 28 April 2011

Ayurvedic Facepack for black spots | Ayruvedic Tips | ముఖం మీద నల్ల మచ్చలకు ఫేస్ ప్యాక్

ముఖం మీద నల్ల మచ్చలకు ఫేస్ ప్యాక్ 
కావలసిన పదార్ధములు:
  •  ఒక కోడి గ్రుడ్డు 
  •  ఒక టీ స్పూన్ తేనె 
  • ఒక టీ స్పూన్ క్యారట్ జూసు 
  • 5 గ్రాముల వెల్లుల్లి పేస్టు 
తాయారు చేయు విధానం: 
 ఒక కప్పు లోనికి కోడి గ్రుడ్డు పగులగొట్టి ఒక బౌల్ లో పోయాలి. తర్వాత వేరొక బౌల్ లోనికి తెల్ల సొనను మాత్రమే వంపుకోవాలి. ఆ తరువాత ఒక టీ స్పూన్ తేనె ను, ఒక టీ స్పూన్ క్యారట్ జూసును కలిపి, వెల్లుల్లి పేస్టును మొత్తం అన్నిటిని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆ పేస్టు మొఖం మొత్తానికి పెదవులకు, కళ్ళకు తగలకుండా మిగత అంతా అప్లై చేయాలి. ఒక 20 నిముషాలు తర్వాత దూది తో గాని, గుడ్డతో గాని తుడిచేసుకోవాలి. 


మొఖంఫై నల్ల మచాలు వచ్చేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు: 
వీలైనంత వరకు ఎండలో వెల్ల కూడదు. ఒకవేళ వెల్ల వలసి వస్తే గుడుగు తప్పకుండ వాడాలి. లేదా మొఖం మొత్తం కవర్ అయ్యేలాగా స్కార్ఫ్ తో కవర్ చేసుకోవాలి. 
 
 
 

No comments:

Post a Comment